జనంన్యూస్. 17.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
జన్మనిచ్చిన ఊరుకు ఏదో చేయాలి అనే సంకల్పంతో తన స్వగ్రామం న్యావనంది గ్రామానికి చెందిన ఎన్నారై దేవి రెడ్డి నాగేష్ గ్రామానికి ఫ్రీజర్ బహూకరించడం జరిగింది. నాగేష్ నాయనమ్మ దేవి రెడ్డి సత్తవ్వ. మరణించగా శవపేటిక వేరే గ్రామం నుంచి తీసుకువచ్చారు, ఫ్రీజర్ యొక్క ఇబ్బందులను మరియు ఫ్రీజర్ యొక్క అవసరాన్ని గుర్తించిన నాగేష్ యొక్క చెల్లెలు కీర్తి శేషులు;దేవి రెడ్డి పద్మ, నాయనమ్మ దేవి రెడ్డి సత్తవ్వ జ్ఞాపకార్థం బహుకరించారనీ , మామిడి కింది మహిపాల్. నెల్ల దాస్ తెలిపారు. గ్రామ అవసరాల దృశ్యం ఎవరైనా చనిపోతే శవ పేటిక ఫ్రీజర్ ప్రక్క గ్రామాల నుండి తీసుకవస్తున్నామని తెలిసి , మానవతా దృక్పథంతో ఆలోచించి గ్రామానికి బహుకరించినందుకు దేవీ రెడ్డి నాగేష్ కు గ్రామప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ మామిడి కింది దీపా నరేందర్. గ్రామ అభివృద్ధి పెద్ద మనుషులు మామిడి కింది నరేందర్. సూర నరేష్.గాండ్ల శ్రీను మరియు నాయకులు AMC డైరెక్టర్ ముతేన్న, ముస్కిల్ నరేందర్, నెల్ల గంగా దాస్, బెజ్జోర రవి, పుల్లారి లింబాద్రి ,రమేష్ రెడ్డి, రాజేశ్వర్ నర్సింగ్ పల్లి, కొండాపురం శ్రీను, లక్ష్మీనారాయణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజల తరఫున ఎన్ఆర్ఐ నాగేష్ కు ధన్యవాదాలు తెలిపారు.


