Listen to this article

జనం న్యూస్‌ 17 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

విజయనగరం జిల్లాలో సంక్రాంతి పండగ సందర్భంగా మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. సంక్రాంతి, కనుమ పండుగ రోజుల్లో మందుబాబులు వైన్ షాపులు, బార్లకు క్యూ కట్టారు. ఏకంగా రూ.13.81 కోట్ల మద్యాన్ని ఫుల్గా తాగేశారు. జిల్లాలో 225 మద్యం షాపులు, 26 బార్లు ఉన్నాయి. ఈనెల 13,14 తేదీల్లో 52,090 కేసుల ఐఎంఎల్ మద్యం, 16న 485 బీర్ కేసుల విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.