జనం న్యూస్. తర్లుపాడు మండలం జనవరి 17
సంక్రాంతిపండుగనుపురస్కరించుకునిమార్కాపురం జిల్లా, తర్లుపాడు మండలం, తర్లుపాడు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ముగ్గుల పోటీలను అత్యంత వైభవంగా నిర్వహించారు. జనసేన మండల నాయకులు వెలుగు కాశి రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు.ఈ కార్యక్రమానికిమార్కాపురం జనసేన పార్టీ ఇన్చార్జి ఇమ్మడి కాశీనాథ్ తర్లుపాడు ఎస్ ఐ బ్రాహ్మనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకైన సంక్రాంతి పండుగ నాడు మహిళల కోసం ఇటువంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అనంతరం పోటీలలో గెలుపొందిన విజేతలకు ఆయన చేతుల మీదుగా బహుమతులను అందజేశారు.మొదటి బహుమతి అప్పల భవిత గెలుపొందగా కూలర్ అందజేశారు రెండవ బహుమతి వెన్నా ధన లక్ష్మీ గెలుపొందగా డ్రెస్సింగ్ టేబుల్ అందజేశారు మూడవ బహుమతి చింతం కల్పన గ్యాస్ పొయ్యి ని అందజేశారు నాలుగవ బహుమతి జి సంధ్య గెలుపొందగా రైస్ కుక్కర్ ప్రధానం చేశారు ఐదవ బహుమతి ది దీప్తి గెలుపొందగా గ్యాస్ స్టవ్ ప్రధానంచేశారుఅంతేకాకుండా, మరో ఐదుగురికి కన్సోలేషన్ బహుమతులుగా చీరలను పంపిణీ చేశారు. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రోత్సాహక బహుమతులు ఈ కార్యక్రమంలో కాపు సంఘం మహిళనాయకురాలు సిద్ధం కృష్ణ వేణి టిడిపి నాయకులు గోసు వెంకటేశ్వర్లు, కొలగట్ల కాశీశ్వర రెడ్డి,వెన్నా రాజా రామ్ రెడ్డి మాజీ కోప్షన్ షేక్ అఫ్రోజ్,షేక్ బాషా తర్లుపాడు మండల జనసేన నాయకులు సూరే సువర్ణ, కొండెబోయిన సునీల్, పఠాన్ కరిముల్లా, గడ్డం బాలరాజు, గుంటు మోషే గంజారపల్లి మహేష్, సయ్యద్ రఫీ, షేక్ రఫీ,తదితరులు పాల్గొన్నారు.


