Listen to this article

జనం న్యూస్ 17 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

జిల్లాలో నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు గ్రామ పరిపాలన,అభివృద్ధిపై అవగాహన కల్పించడానికి శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు పరిపాలనపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.ఈ శిక్షణలో పంచాయతీ రాజ్ చట్టం 2018, గ్రామ పాలన విధులు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు సర్పంచ్‌ల బాధ్యతలపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు.జిల్లాలోని ఎర్రవల్లిలోని రెసిడెన్షియల్ 10వ పోలీస్ బెటాలియన్‌లో అయిదు రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనునట్లు తెలిపారు. మొదటి దశ (స్పెల్–I) శిక్షణ కార్యక్రమాలు మూడు బ్యాచులుగా జనవరి 19 నుంచి జనవరి 23 వరకు ఎర్రవల్లిలోని 10వ పోలీస్ బెటాలియన్‌లో నిర్వహించనునట్లు తెలిపారు. బ్యాచ్-1 లో గద్వాల్ (28 గ్రామ పంచాయతీలు), కేటీ దొడ్డి (23 గ్రామ పంచాయతీలు) మండలాల నుంచి మొత్తం 51 గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు గంగా–1 హాల్‌లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.బ్యాచ్-2 లో మల్దకల్ (25 గ్రామ పంచాయతీలు), గట్టు (27 గ్రామ పంచాయతీలు) మండలాల నుంచి 52 గ్రామ పంచాయతీలు గోదావరి–2 హాల్‌లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.బ్యాచ్-3 లో ధరూర్ (28 గ్రామ పంచాయతీలు),వడ్డేపల్లి (10 గ్రామ పంచాయతీలు), ఉండవెల్లి (15 గ్రామ పంచాయతీలు) మండలాల నుంచి 53 గ్రామ పంచాయతీలు కృష్ణ–3 హాల్‌లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.ఈ శిక్షణలు ప్రతిరోజూ ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.రెండో దశ (స్పెల్–II) శిక్షణ కార్యక్రమాలు రెండు బ్యాచులుగా ఫిబ్రవరి 9 నుండి ఫిబ్రవరి 13 వరకు నిర్వహించబడతాయని తెలిపారు. బ్యాచ్ -1 లో అయిజ (28 గ్రామ పంచాయతీలు), ఇటిక్యాల (14 గ్రామ పంచాయతీలు), రాజోలి (11 గ్రామ పంచాయతీలు) మండలాల సర్పంచ్‌ల మొత్తం 53 మంది గంగా–1 హాల్‌లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.మనోపాడు (17 గ్రామ పంచాయతీలు),అలంపూర్ (14 గ్రామ పంచాయతీలు), ఎర్రవల్లి (15 గ్రామ పంచాయతీలు) మండలాల సర్పంచ్‌ల మొత్తం 46 మంది గోదావరి-2 హాల్ లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.ఈ శిక్షణలు ప్రతిరోజూ ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. సంబంధిత మండలాలకు చెందిన గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు తప్పనిసరిగా హాజరై ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. జారీ చేయువారు: డిపిఆర్ఓ జోగులాంబ గద్వాల జిల్లా.