Listen to this article

బిచ్కుంద జనవరి 17 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణంలో ప్రసిద్ధి చెందిన కాశి విశ్వనాథ ఆలయ, బండయప్ప మాట సంస్థాన్ పీఠాధిపతి శ్రీ సద్గురు సోమలింగ శివ చర్య స్వామి పై జుక్కల్ మాజి ఎమ్మెల్యే హనుమంత్ షిండే అనుచిత వ్యాఖ్యలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బ తేనెల చేసినందుకు నిరసనగా శనివారం సోమయప్ప స్వామి భక్తులు, శిష్యుల ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. ఉదయం నుండి వాణిజ్య వ్యాపార సముదాయాలు బంధు సందర్భంగా మూసి వేసి సంఘీభావం తెలిపినారు.ఈ సందర్భంగా స్వామి భక్తులు, శిష్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి బిచ్కుంద పట్టణంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది భక్తులు,శిష్యులు విశ్వసించే బండయప్ప మాట సంస్థాన్ పీఠాధిపతి పై మాజి ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చెయ్యడం భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా చెయ్యడం తోపాటు తీవ్రంగా గాయపర్చాయని పలువురు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మూడు సార్లు ఎమ్మెల్యే ఉన్న షిండే సమయంలో షిండే తోపాటు అతని అనుచరులు కలిసి స్వామి వద్దకు వచ్చి ఎన్నో తమ తమ వ్యక్తి గత, ప్రజా సమస్యలు పరిస్కరించుకున్న విషయం అందరికి తెలిసిందే అని తెలిపారు. అలాంటిది నేడు మర్చిపోయి అదే స్వామి పై ఇప్పుడు గౌరవానికి భంగం కలిగేల మాట్లాడడం సరైంది కాదని స్వామి భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ పార్టీలకు అతీతంగా,రాజకీయాలకు సంబంధం లేకుండా భక్తుల ఆత్మ గౌరవ పరిరక్షణ కోసం పట్టణం లోని ప్రధాన వీధుల గుండా పెద్ద సంఖ్యలో హాజరై శాంతి యుత ర్యాలీ నిర్వహించి భక్తుల ఐక్యతను చాటుకున్నారు. మాజి ఎమ్మెల్యే షిండే స్వామి పై చేసిన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.