జనం న్యూస్ జనవరి 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
డబల్ ఇంజిన్ సర్కారు ఉండటం వలన రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ సహాయ సహకార వల్ల దేశంలో ఏ రాష్ట్రo లో లేని విధంగా 270 ప్రాజెక్టులను ముఖ్యంగా హైవేలు విమానాశ్రయాలు పోర్టులకు, ప్రాధాన్యత కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రం పురోగతి అభివృద్ధి సాధిస్తుందని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు ఈరోజు పార్లమెంట్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కేంద్ర నిర్ణయాలను రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తం పరుస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో 800 ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించుకుంటే దానిలో ఎక్కువ సంఖ్యలు 270 ప్రాజెక్టులకు 1,15,000 కోట్ల నిధులను కేటాయించారని, దీనిలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జలజీవన్ మిషన్ మంచినీరు సౌకర్యం, అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్ట్, అమరావతి కనెక్టెడ్ హైవేస్, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, సోలార్ ప్రాజెక్టులు, రాష్ట్రంలో ప్రధానమైన నగరాలకు విమానాశ్రయాలు, షిప్ బిల్డింగులు, పోర్టులు, నౌకలు మరమ్మత్తు సదుపాయాలు, ప్రపంచ వ్యాప్తంగా వివిధ పోర్టులో అమలులో ఉన్న విధానాలను, అక్కడే అత్యుత్తమ విధానాలను ఇక్కడ అమలు చేసే విధంగా అధికారులను పరిశీలన చేయడానికి ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిందని నాగ జగదీష్ అన్నారు. రాష్ట్రంలో తీరప్రాంతాల అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని, దేశంలో ఎక్కడా లేని విధంగా 1054 కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతం ఉండడం దానిని అభివృద్ధి చేయడానికి 15,601 కోట్ల రూపాయలు పెద్ద పెద్ద సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారని, ఈ తీర ప్రాంతం అభివృద్ధి చేయడానికి మారిటైo రంగంలో భారీగా పెట్టుబడులను ఆకర్షించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని, ఈ మేరకు ఈ రంగంలోని వివిధ సంస్థలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుందని ఎంఓయూలు కుదుర్చుకుంటుందని నాగ జగదీష్ అన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో భోగాపురం విమానాశ్రయం పిపిపి పద్ధతిలో శరవేగంగా జిఎంఆర్ సంస్థ అనుకున్న దానికంటే ముందే జూన్ నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తుందని, జూలై నుండి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, దీని మూలంగా ఉద్యోగ అవకాశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా రాబోతున్నాయని నాగ జగదీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ బీసీ బోడి వెంకటరావు శ్రీ భోగలింగేశ్వర దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


