

బలిజిపేట జనం న్యూస్ ప్రతినిధి పి. జయరాం :-మండలంలోని 147044 చేప పిల్లలు ను వివిధ ప్రభుత్వ చెరువల లో గురువారం ఆ శాఖ అధికారుల సమక్షంలో విడుదల చేసారు, ఈ సందర్భంగా
చేప పిల్లల పెంపకం పై మత్స్యకారులు దృష్టి సారించాలని ఎఫ్డిఓ శ్రీదేవి అన్నారు బలిజిపేట మండలంలో ఆయా గ్రామ పంచాయతీ పరిధిలోని చెరువులలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా సబ్సిడీపై చేప పిల్లలను విడుదల చేసారు . ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అధికారులు కమిటీ సమక్షంలో కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు .బలిజిపేట మండలంలో మండలంలోని బర్లి గ్రామంలో తామర చెరువు లో 20 వేలు గంగాడ గ్రామంలో వల్లభ నాయుడు చెరువు, సిమ్మి నాయుడు చెరువు, హుస్సేన్ ఖాన్ చెరువు లో 9,544, పెద పెంకి గ్రామంలో కృష్ణ సాగరంలో 34,000 అసిరి పోలు చెరువులో 2,500, నూకల వాడ గ్రామంలో గుప్త చెరువులో 12వేలు, పలగర గ్రామం తామర చెరువులో 10వేలు, నారాయణపురం గ్రామం మల్లమ్మ చెరువులో22,500 గొల్లంపి వాని చెరువులో 22,500 రావివలస గ్రామం లో దన్నాన చెరువులో14 వేలు చేప పిల్లలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అభివృద్ధి అధికారి ఎల్లేటి శ్రీదేవి మరియు పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, మత్స్యకార సహకార సంఘ ప్రెసిడెంట్లు, గ్రామ మత్స్య సహాయకులు ఎ .కీర్తి ప్రియ , కె శంకరరావు, ఎన్.శ్రీకాంత్ పాల్గొన్నారు