Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 19

తర్లుపాడు, జనవరి 19: ఆంధ్రప్రదేశ్.ప్రభుత్వంపశుసంవర్ధక శాఖ ఆదేశాల మేరకు తర్లుపాడు మండలంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 19 నుంచి 31వ తేదీ వరకు మండలంలోని అన్ని గ్రామాల్లో ఈశిబిరాలునిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం (జనవరి 19) తాడివారిపల్లి గ్రామంలో పశు వైద్యాధికారి డా. డి. విష్ణు వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ శిబిరంలో పశు వైద్యాధికారి డా. విష్ణు వర్ధన్.రెడ్డిమాట్లాడుతూ.. పాడి రైతులు, సన్నజీవాల కాపరులు తమ జీవాల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా:లేగ దూడలు, పశువులు, గొర్రెలు మరియు మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందులు తాగించారు.గర్భకోశ వ్యాధులు కలిగిన పశువులను గుర్తించి, వాటికి తగు చికిత్స అందించారు.ఈ ఒక్క రోజే గ్రామంలోని 37 పశువులు/దూడలకు మరియు 2540 గొర్రెలు/మేకలకు నట్టల నివారణ మందులు అందజేశారు.రైతులకు పశు బీమా పథకం గురించి డాక్టర్ విష్ణు వర్ధన్ రెడ్డి వివరంగా అవగాహన కల్పించారు. ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే మూడేళ్ల వరకు బీమా వర్తిస్తుందని, ఒక రేషన్ కార్డుపై ఏడాదికి 10 పశువులు, 100 గొర్రెలు/మేకలకుబీమాచేయించుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం 85% సబ్సిడీని భరిస్తుండగా, లబ్ధిదారులు చాలా తక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుందన్నారు.మేలు జాతి పశువులు (రూ. 30 వేల బీమా): లబ్ధిదారుని వాటా కేవలం రూ. 288/- (ప్రభుత్వం రూ. 1632 భరిస్తుంది).నాటు జాతి పశువులు (రూ. 15 వేల బీమా): లబ్ధిదారుని వాటా కేవలం రూ. 144/- (ప్రభుత్వం రూ. 816 భరిస్తుంది).గొర్రెలు/మేకలు (రూ. 6 వేల బీమా): లబ్ధిదారుని వాటా కేవలం రూ. 27/- (ప్రభుత్వం రూ. 153 భరిస్తుంది).రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అలాగే లాభసాటి పాడి పరిశ్రమ, యాజమాన్య పద్ధతులపై రైతులకు మెలకువలు నేర్పించారు.ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ బి. త్రినాధ్ రెడ్డి, నాగేండ్లమూడుపు ఏహెచ్ఏ జి. పుణ్యవతి, గ్రామ రైతులు, సన్నజీవాల కాపరులు పాల్గొన్నారు.