Listen to this article

జనం న్యూస్ 6 ఫిబ్రవరి 2025 బండి ఆత్మకూరు మండలం, శ్రీశైలం నియోజకవర్గం,నంద్యాల జిల్లా : ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వ్యవసాయ ఉపాధి కూలీలకు మొండిచేయి చూపించిందని ఏ కోడూరు గ్రామంలో నిరసన వ్యక్తం చేస్తూ బడ్జెట్ కాఫీలను దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు డేవిడ్, ఉపాధి కూలీలు రాజేష్,సుందరావు లు మాట్లాడుతూ పేదలకు కడుపు నింపే పథకం ఉపాధి హామీ పథకం అని ఆ పథకాన్ని నిర్వీర్యం చేయుటకు కుట్ర పన్నుతున్నారని,ఒక పైసా ఈ పథకానికి కేటాయించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్లో ఉపాధి కూలీలకు రాష్ట్రానికి నిధులు కేటాయించకపోతే రాబోవు కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.