Listen to this article

ఐదు వాహనాలు సీజ్

జనం న్యూస్, జనవరి 19,అచ్యుతాపురం:

రాంబిల్లి మండల పరిధిలో లేబర్‌ను అక్రమంగా రవాణా చేస్తున్న ఐదు వాహనాలను పోలీసులు సీజ్ చేసి కేసులు నమోదు చేసినట్లు రాంబిల్లి ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. లేబర్ రవాణాకు అనుమతి లేని గూడ్స్ క్యారియర్ వాహనాలను వినియోగించడం చట్ట విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.భవిష్యత్తులో ఎవరైనా లేబర్ రవాణా కోసం గూడ్స్ క్యారియర్ వాహనాలను ఉపయోగిస్తే, సంబంధిత కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లేబర్ భద్రతను దృష్టిలో ఉంచుకొని, అన్ని నియమాలు పాటిస్తూ అనుమతితో కూడిన వాహనాల్లోనే రవాణా చేయాలని పోలీసులు సూచించారు.