Listen to this article

జనం న్యూస్, జనవరి 19,అచ్యుతాపురం:

అచ్యుతాపురం మండలం మోసయ్యపేటలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పర్యటించి డ్రైనేజీలు పరిశీలించి తక్షణమే పూడికతీత పనులు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం ఒక కర్రతో ఎంత లోతు ఉందనేది స్వయంగా కొలిచి,డ్రైనేజీల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించి, డ్రైనేజీల నిర్మాణాన్ని చేపడతామని మోసయ్యపేట గ్రామస్తులకు హామీ ఇచ్చారు.అక్కడే ప్రజలు, అధికారులతో కూర్చుని మ్యాప్ ని పరిశీలించారు. అదే విధంగా డ్రైనేజీలపై అనధికారికంగా ఉంచిన పలకలను తొలగించాలని అధికారులను ఆదేశించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాలలో మోసయ్యపేట ప్రజలను మాజీ ఎమ్మెల్యే కన్నబాబు డ్రైనేజీలు నిర్మాణం చేయకుండా మోసం చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.