

జనం న్యూస్ ఫిబ్రవరి 6 గొలుగొండ రిపోర్టర్ పొట్ల రాజా : గొలుగొండ మండలం పాకలపాడు గ్రామంలో పిల్లి చిన్నోడు. లక్ష్మీ, గండబోయిన రాము, గండిబోయిన నూకాలమ్మ దంపతుల ఆర్థిక సహకారంతో దుర్గమ్మ విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు వేదపండితుల మంత్రోచ్చారణ నడుమ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీరసూర్యచంద్ర మాట్లాడుతూ గ్రామంలో ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మికత సంతరించుకుంటుందన్నారు. ప్రతీ ఒక్కరు ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో నైదాన నవీన్, జనసేన మండల ప్రధాన కార్యదర్శి సలాదుల ప్రసాద్ బాబు, నాతవరం మండల నాయకులు ప్రగడ కృష్ణబాబు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.