జనం న్యూస్ 20 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గంలో పర్యటించి, ఇటీవల మరణించిన పార్టీ శ్రేణుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.ముందుగా కొత్త కర్ర గ్రామంలో వైఎస్ఆర్ సీపీ జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు బూర్లె నరేష్ పెద్దమ్మ బూర్లె విజయలక్ష్మి ఇటీవల మృతి చెందగా, వారి నివాసానికి వెళ్లి విజయలక్ష్మి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యం చెప్పారు.అక్కడి నుండి గరివిడి గ్రామానికి చేరుకున్న చిన్న శ్రీను, ముళ్ళు రాంబాబు తమ్ముడు ముళ్ళు సత్యనారాయణ అకాల మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. సత్యనారాయణ చిత్రపటానికి నివాళులర్పించి, శోకతప్త హృదయంతో ఉన్న వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. పార్టీ ఎల్లప్పుడూ కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు.ఈ పరామర్శ కార్యక్రమంలో..ఎంపీపీ ప్రతినిధి వేణు, వైఎస్ఆర్సిపి మండల పార్టీ ప్రెసిడెంట్ వెంకట్రావు, పప్పల కృష్ణ, జగన్, గరివిడి ఎంపీపీ ప్రతినిధి విశ్వేశ్వరరావు, వల్లి రెడ్డి లక్ష్మణ్, తమ్మి నాయుడు, వాకాడు శ్రీను, బమ్మిడి కార్తీక్ ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


