Listen to this article

జనం న్యూస్ 20 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

బి ఆర్ యస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బాసు హనుమంతు నాయుడు అన్న మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్ అన్న ఆదేశానుసారం మున్సిపల్ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే క్రమంలో భాగంగా నిన్న రాత్రి గద్వాల జిల్లా కేంద్రంలోని గంజిపేట 14వార్డు లో ప్రజలతో సమావేశం నిర్వహించిన బి ఆర్ యస్ పార్టీ 14 వార్డు నాయకులు పి డి యస్ యూ గంజిపేట రాజు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడం ఖాయం.రెండు సంవత్సరాలుగా పట్టణాలను సంక్షోభం నెట్టిన కాంగ్రెస్ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుంది.ఒక్క రూపాయి కూడా పట్టణాలకు ఇవ్వని ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీనేన్నారు.రెండు సంవత్సరాల్లో పట్టణాలకు ఇచ్చిన నిధులు,చేసిన అభివృద్ధిని చూపించి ఓట్లు అడగాలని కాంగ్రెస్ ప్రభుత్వని నిలదీశారు.రానున్న పురపాలక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలని గంజిపేట రాజు కోరారు.