Listen to this article

బిచ్కుంద జనవరి 20 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని కందర్‌పల్లి గ్రామంలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక-సామాజిక అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.. మహిళలు ఆర్థికంగా బలోపేతం అయితే కుటుంబం, సమాజం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు..ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి , మున్సిపల్ కమిషనర్ షేక్ హయం , ఎంఆర్ఓ వేణుగోపాల్ ఎంపీడీవో గోపాలకృష్ణ డెలికేట్ విట్టల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వాజిద్ నగర్ సర్పంచ్ గోపాల్ రెడ్డి, సంజు పటేల్ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.