

జనం న్యూస్ 07 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
వెయిట్ లిఫ్టింగ్‌కు పుట్టినిల్లు కొండవెలగాడ తన పేరును సార్థకం చేసుకుంది. వల్లూరి శ్రీనివాసరావు, మత్స సంతోషి లాంటి సీనియర్ లిష్టర్లు ఈ గ్రామం నుంచే వెళ్లి కామన్ వెల్త్‌లో ఛాంపియన్స్‌గా నిలిచి దేశ ఖ్యాతిని ఖండాంతరాల్లో నిలిపారు. వాళ్లని ఆదర్శంగా తీసుకొని పదుల సంఖ్యలో క్రీడాకారులు గ్రామం నుంచి పుట్టుకొచ్చారు. తాజాగా జాతీయస్థాయిలో జరిగిన పోటీల్లో గ్రామానికి చెందిన శనపతి పల్లవి గోల్డ్ మెడల్ కొట్టింది.