Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 20

తర్లుపాడు: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థుల విజయానికితోడ్పాటునందించేలాస్టేట్.టీచర్స్. యూనియన్ ఎస్ టి యు తర్లుపాడు మండల శాఖ ఆధ్వర్యంలో ఉచిత స్టడీ మెటీరియల్పంపిణీకార్యక్రమం నిర్వహించారు.మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకుదాతలసహకారంతో ఈ మెటీరియల్‌ను అందజేశారు.ఎస్టీయూ మండల అధ్యక్షులు కశెట్టి జగన్ బాబు అధ్యక్షతన, జనరల్ సెక్రటరీ షేక్ నజీర్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు ఎర్రయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తర్లుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలవిద్యార్థులకు ఆయన చేతుల మీదుగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. సందర్భంగాజిల్లాఅధ్యక్షులు ఎర్రయ్య మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు కోసం ముందుకు వచ్చిన దాతలు లయన్స్.క్లబ్.టిరామకృష్ణ,బివిరంగయ్య,కమలా పాఠశాల, డాక్టర్కె.స్వాతి,ఎన్.ఎస్.ఎడ్యుకేషన్,గంగిశెట్టి కిరణ్ గుంపల్లి రత్నం శెట్టి,జవ్వాజి విజయ లక్ష్మి, ముక్కర అశోక్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చదువులో రాణించాలని, వారి సంకల్పం గొప్పదని కొనియాడారు.
విద్యార్థుల కోసం ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన ఎస్టీయూ మండల అధ్యక్షులు కశెట్టి జగన్ బాబును జిల్లా అధ్యక్షులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన్ను శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈకార్యక్రమంలోప్రధానోపాధ్యాయులు ఎం. సుధాకర్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు రామకృష్ణ, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.