Listen to this article

జనంన్యూస్. 20.శ్రీనివాస్ పటేల్.సిరికొండ.

ధ్రుడత్వానికి మానసిక ఉల్లాసనికి స్నేహానికి క్రీడాలే కీలకం అని ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ) జిల్లా ఉపాధ్యక్షురాలు పి రమ పేర్కొన్నారు. సిరికొండ మండలంలో తుంపల్లి లో మంగళవారం నాడు ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ) మహిళా సమావేశం అనంతరం జరిగిన మహిళలకు క్రీడోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గోని ప్రసంగిస్తు: సమాజంలో గ్రామీణ క్రీడలు కనుమరుగయి నేటి తరానికి వాటిపై అవగాహన తగ్గిందన్నారు. దీనివల్ల గ్రామాల్లో క్రీడలు జరగడం లేదన్నారు. క్రీడలు మహిళలల్లో ఐక్యతకు, మానసిక దృఢత్వానికి అవసరమని ఆమె అన్నారు. ప్రభుత్వం గ్రామీణ క్రీడల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం (పిఓడబ్ల్యు)అనేక సంవత్సరాలుగా మహిళలకు క్రీడలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. మహిళలు ఈ సందర్భంగా తమ చైతన్యాన్ని పెంపొందించుకొని స్త్రీ పురుష సమానత్వం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు ఐక్యంగా హక్కుల కోసం పోరాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో మాస్ లైన్ పార్టీ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్, మాట్లాడినారు. పివోడబ్ల్యూజిల్లాఉపాధ్యక్షలు వి సత్తెవ్వ, డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆర్ పష్పాలత, మండల ప్రధానకార్యదర్శి జమున, డివిజన్ నాయకులు పద్మ, ఈ స్వరూప, ఎం లత, ఎం.లక్ష్మి AIPKMS జిల్లా నాయకులు ఎం సాయరెడ్డి జిల్లా నాయకులు జె బాల్ రెడ్డి,జె ఎర్రన్న, AIUKS వి భూమాగౌడు, ఎం మోహన్ తదితరులు పాల్గొన్నారు.