సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశం జనం న్యూస్ జనవరి 19
నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ జగదాంబ సోమప్ప, ఉపసర్పంచ్‌తో పాటు గ్రామ పెద్దలు ముఖ్య అతిథులుగా హాజరై ఉపాధి హామీ పనులను అధికారికంగా ప్రారంభించారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి సాధ్యమవుతుందని సర్పంచ్ జగదాంబ సోమప్ప ఈ సందర్భంగా తెలిపారు. నూతన సంవత్సరంలో గ్రామానికి మరిన్ని అభివృద్ధి పనులు తీసుకురావడానికి కృషి చేస్తామని, ఉపాధి హామీ పనులను పకడ్బందీగా నిర్వహించి ప్రతి అర్హుడైన కూలీకి పని దొరికేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఉపసర్పంచ్ మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల ద్వారా గ్రామంలో రోడ్లు, కాలువలు, నీటి సంరక్షణ పనులు, పచ్చదనం పెంపొందించే కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, వార్డు సభ్యులు, కూలీలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నూతన సంవత్సరం ప్రారంభంలోనే ఉపాధి హామీ పనులు ప్రారంభం కావడం గ్రామ ప్రజల్లో ఆనందాన్ని నింపింది.


