

జనం న్యూస్ 07 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం నగర పాలక సంస్థలో అద్దెలు చెల్లించని షాపులపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకున్నారు.నగర పాలక సంస్థలో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లో అద్దె బకాయిలు ఉన్న షాపులకు వెళ్లి తాళాలు వేశారు. అద్దె సకాలంలో చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ నల్లనయ్య హెచ్చరించారు.కమిషనర్ ఆదేశాలు మేరకు షాప్‌లకు తాళాలు వేసినట్లు అధికారులు తెలిపారు.