తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మొహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 20 జనవరి
జహీరాబాద్ మండల తహశీల్దార్ కు అదనపు బాధ్యతలు మున్సిపల్ కమిషనర్ గా నిర్వహిస్తున్నందుకు జహీరాబాద్ బీసీ జేఏసీ కమిటీ తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు
పీ.దశరత్ను మున్సిపల్ కమిషనర్ పదవికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 19 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు కమిషనర్ కే. సత్య ప్రణవ్ శిక్షణా కార్యక్రమానికి హాజరవుతున్నందున తహసీల్దార్ కు కమిషనర్ బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉండగా గ్రూప్-1 నుంచి కమిషనర్ గా బాధ్యతలు చేపట్టడంతోనే ఎన్నికలొచ్చాయి. ఎన్నికల నిర్వహణపై అవగాహన లేని కారణంగా కలెక్టర్ ఆదేశాలతో కొంతకాలంగా తహసీల్దార్ ఎన్నికల విధులను పర్యవేక్షిస్తున్న సదరు తహసీల్దార్ ప్రస్తుతం పూర్తి బాధ్యతలు చేపట్టారు . బీసీ జేఏసీ జహీరాబాద్ తాలూకా కమిటీ అధ్యక్షులు కొండాపురం నరసింహులు ,, బీసీ జెఎసి చైర్మన్, పెద్ద గొల్ల నారాయణ, ఉపాధ్యక్షులు, విశ్వనాధ్ యాదవ్, మో హమ్మద్ ఇమ్రాన్, వడ్డె శేఖర్, శంకర్ సాగర్, మాదినం శివప్రసాద్, తరపున శుభాకాంక్షలు తెలిపారు


