జనం న్యూస్ జనవరి 20 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
172 సంవత్సరాల చరిత్ర కలిగిన వేల్పుల వీధి శ్రీశ్రీశ్రీ గౌరీ పరమేశ్వరి అమ్మవారి ఉత్సవ మహోత్సవ కార్యక్రమం జనవరి 24వ తేదీన పండగ నిర్వహిస్తున్నామని ఉత్సవ కమిటీ సభ్యులు ఈరోజు ఉదయం అనకాపల్లి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వరరావు ను కలుసుకొని ఉత్సవానికి విచ్చేయవలసిందిగా ఆహ్వానం పలుకుతూ అమ్మవారి ఆహ్వాన పత్రికలను కమిటీ సభ్యులతో కలిసి విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు బొద్ధపు ప్రసాద్, కోట్ని రామకృష్ణ, అశోక్ కమిటీ కార్యదర్శి నానేపల్లి రవికుమార్ కోశాధికారి పోతల రమణ ఉపాధ్యక్షులు పెద్దిరెడ్డి నాగు సరిశెట్టి చిన్న సహాయ కార్యదర్శులు వేముల పాపయ్య శెట్టి పద్మనాభని శంకర్ తదితరులు పాల్గొన్నారు.//


