

జనం న్యూస్ 07 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
కాలువలలో చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విజయనగరం నగర పాలక సంస్థ కమిషనర్ నల్లనయ్య హెచ్చరించారు. నగర పాలక సంస్థలో కాలువలలో పేరుకుపోయిన పూడికలను గురువారం పారిశుద్ధ్య కార్మికులతో తొలగించారు. కాలువలలో చెత్త వేయడం వలన పూడికలు పేరుకుపోతున్నాయని, కాలువలు, రోడ్లుపై చెత్తను వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాలువలను శుభ్రం చేయాలని పారిశుద్ధ్య కార్మికులను ఆదేశించారు.