Listen to this article

విజయనగరం 2వ పట్టణ సిఐ టి.శ్రీనివాసరావు

జనం న్యూస్‌ 21 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

విజయనగరం పట్టణంకు చెందిన ఒక మహిళ పట్టణంలో వివిధ షాపులలో బట్టల షాపింగ్ చేసి విజయనగరం ఆర్.టి.సి. కాంప్లెక్స్ వద్ద ఆటో ఎక్కి కోట, మూడు లాంతర్ల మీదుగా బూడి వీధిలో దిగి సుమారు రూ.15,000లు విలువగల బట్టల బ్యాగును ఆటోలో మరిచిపోయి తన ఇంటికి వెళ్ళిపోయింది. అనంతరం విజయనగరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, 2వ పట్టణ సిఐ టి.శ్రీనివాసరావు వెంటనే తన పరిధిలో ఏర్పాటు చేసిన సి.సి.టి.వి. కెమెరాల ద్వారా ఆ ఆటోను గుర్తించి తన బృందాన్ని పంపించి ఆ బ్యాగును రికవరీ చేసి బాధిత మహిళకు అందించటం జరిగిందని అన్నారు. పోలీసులు ఎంతో బాధ్యతతో వెంటనే పోయిన బ్యాగును వెతికి ఇచ్చినందుకు ఆమె ఆనందాన్ని వ్యక్తం చేసి, 2వ పట్టణ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.