జనం న్యూస్ 21 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు రోడ్డు భద్రత చర్యలలో భాగంగా ఈరోజు పార్వతీపురం పట్టణంలో లో ఉన్న పెట్రోల్ బంక్ యజమానులతో తొ పార్వతిపురం టౌన్ సిఐ వెంకట రావు గారు సమావేశం ఏర్పాటు చేసి, ఇందనం(పెట్రోల్ ) కొనుగోలు చేయడానికి వచ్చే వాహనదారులతో సామరస్యంగా మాట్లాడుతూ వాహనదారులకు పెట్రోల్ కొట్టేటప్పుడు తప్పనిసరిగా శిరస్త్రదారణంతో రావలెను, శిరస్త్రదారణం లేని యెడల పెట్రోలు ఇవ్వడం జరగదు అనే విషయాన్ని అందరికీ అవగాహన జరిగే విధంగా చూడాలని చెప్పారు. అంతేకాకుండా పెట్రోల్ బంకులో ఎక్కువగా నగదు ఉండకూడదని తెలియజేశారు. బంక్ పరిసరాలు మొత్తం కవర్ చేసేలా సిసి కెమరాలు ఏర్పాటు చెయ్యాలని, ఎవరితో అనవసరంగా వాగ్వాదం చేయకుండా అందరికీ అర్థమయ్యే విధంగా భద్రత చర్యలలో భాగంగా హెల్మెట్ లేనిది పెట్రోల్ ఇవ్వడం జరగదని విషయాన్ని మీ సిబ్బందికి తెలియజేయాలని సూచించారు. అదేవిధంగా నో హెల్మెట్ – నో పెట్రోల్ అనే నినాదం సంబంధించిన బ్యానర్స్ను పెట్రోల్ బంకుల దగ్గర కట్టించడం జరిగింది.


