సర్పంచ్ శ్వేత కృష్ణ, జనం న్యూస్,జనవరి 21,కంగ్టి,
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని గణపూర్ గ్రామంలో బుధవారం అంగన్వాడి చిన్నారులకు ఏకరూపు వస్త్రాలను సర్పంచ్ శ్వేతా కృష్ణా ముదిరాజ్ చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరు తమ చిన్నారులకు అంగన్వాడి కేంద్రానికి పంపించాలని అన్నారు. చిన్నారులకు అంగన్వాడి కేంద్రానికి పంపించడంతో విద్యతోపాటు,శారీరక మానసిక,దృఢత్వం, పెరుగుతుందని అన్నారు.గర్భిణీలు, బాలింతలు,అంగన్వాడి కేంద్రంలో అందించే పౌష్టిక ఆహారాన్ని స్వీకరించాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే సలహాలు సూచనలు పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ సంతోషి,ఆయమ్మ పోచవ్వ,వార్డు సభ్యులు,గర్భిణీలు బాలింతలు,చిన్నారులు తదితరులు పాల్గొన్నారు,


