జనం న్యూస్ 21 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
గద్వాల పట్టణ అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం …ఈరోజు గద్వాల పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా బీ.టి రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం రోడ్డు విస్తీర్ణం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. 18.70 కోట్లు రూపాయలు వ్యయం తో నిధులు మంజూరు కావడంతో ఈ కింది వాటిలో అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం జరిగినది.బాలరక్షక సధన్ ముందు రోడ్డుకు పైప్ కల్వర్టు, డ్రైనేజ్ రెండవ రైల్వే గేట్ ఓలివా చర్చి ముందు డ్రైనేజీ వ్యవస్థ
బి ఆర్ అంబేద్కర్ చౌక్ లో డ్రైనేజ్, బీటీ రోడ్డు నిర్మాణానికి ఐ డి యస్ యం టి కాలనీ లో సీసీ రోడ్డు నిర్మాణానికి చింతల పేట మెయిన్ రోడ్డు విస్తీర్ణం ప్రధాన రహదారి వెడల్పు భూమి పూజ చేసి ఎమ్మెల్యే పనులను ప్రారంభించడం జరిగినది ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా గద్వాల పట్టణ అభివృద్ధి కోసం 18.70 కోట్లు రూపాయలు మంజూరు చేయడం జరిగినది. దీనితో గద్వాల పట్టణంలోని ప్రధాన రహదారిలో బీటీ రోడ్డు నిర్మాణం డ్రైనేజీ నిర్మాణం చేయడం జరుగుతుంది. పట్టణంలో ప్రధాన రహదారిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాహనదారులకు వ్యాపారస్తులకు ఇలాంటి ఇబ్బంది కలవకుండా ఉండాలని ప్రభుత్వం దూర దృష్టితో ఆలోచించి ప్రధాన రహదారులను రోడ్డు నిర్మాణంలో కు ప్రత్యేక నిధులను కేటాయించడం జరిగింది త్వరలోనే రోడ్డు నిర్మాణం పనులను పూర్తిచేసి ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు కాంట్రాక్టర్లకు సూచించారు. అదేవిధంగా భవిష్యత్తులో గద్వాల పట్టణం మరింత అభివృద్ధి చేసుకునే విధంగా నా వంతు సహాయ శక్తుల కృషి చేస్తానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కి, రాష్ట్ర మంత్రివర్యులు గద్వాల పట్టణ ప్రజలకు తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు …ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు, జిల్లా సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, పటేల్ ప్రభాకర్ రెడ్డి, జి. వేణుగోపాల మాజీ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ శ్రీధర్ గౌడ్, మాజీ ఎంపీపీ విజయ్, జిల్లా సర్పంచులు సంఘం అధ్యక్షుడు రాజశేఖర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్ మాజీ కౌన్సిలర్స్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




