Listen to this article

చట్టాన్ని అతిక్రమిస్తే శిక్ష తప్పదు..
▪️షేక్ సాబీర్ అలీ, కాటిపల్లి రాజు అరెస్ట్..
▪️ పట్టణ సిఐ వరగంటి రవి..

జనం న్యూస్// ఫిబ్రవరి 7 // జమ్మికుంట// కుమార్ యాదవ్..జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లికి చెందిన షేక్ షాబీర్ అలీ, కాటేపల్లి రాజుని అరెస్ట్ చేసినట్టు, పట్టణ సీఐ వరగంటి రవి ఒక ప్రకటనలో తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం, ఎండి అరిఫుద్దీన్ అనే వ్యక్తికి, సంబంధించిన సర్వేనెంబర్ 464, భూమి విషయంలో కాటేపల్లి రాజు, కటిపల్లి సంధ్య,కటిపల్లి లక్ష్మి, అక్రమంగా ప్రవేశించి ఎలాంటి పత్రాలు లేకుండా, ఫోర్జరీ చేసిన పత్రాలను దొంగ డాక్యుమెంట్లను తయారు చేసి, అందులో అక్రమంగా చొరబడి, (టెంట్ )వేసుకొని దీక్ష చేస్తున్నారని, ఎండి హరిఫుద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. సామాజికవేత్త ముసుగులో ఉన్న షేక్ షబీర్ అలీ, కాటిపల్లి రాజు అనే వ్యక్తులు, భూ కబ్జాదారులకు మద్దతుగా,ఆ భూమి నిజమైన యజమానిని భయభ్రాంతులకు, గురి చేయగా వారిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలు, లక్ష్యంగా సామాజిక వ్యక్తీ మూసుగు లో ఎన్నో అక్రమాలు చేసిన షేక్ షాబీర్ అలీ పై, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. అక్రమాలకు పాల్పడుతూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ, తనకు సంబంధం లేని భూమి వివాదం లో తల దూర్చి, భూమి యజమానులను భయబ్రాంతులకు, గురి చేయడంతో బాధితులు ఫిర్యాదు చేశారని గతంలో కూడా జమ్మికుంట పోలీస్ స్టేషన్లో షేక్ షాబీర్ అలీ,కాటిపల్లి రాజులపై కేసులు ఉన్నాయని ఇలాంటివారు సమాజంలో ఉండడం శ్రేయస్కరం కాదని సిఐ పరగంటి రవి తెలిపారు. చట్ట వ్యతిరేక పనులు ఎవరు చేసినా చట్టం తన పని తాను చేసుకోపోతుందని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదు అని, ఈ సందర్భంగా మాట్లాడారు.