

ఎమ్మెల్యే కూనంనేని
జనం న్యూస్ 06 (కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెల్ల శంకర్ )భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..
కొత్తగూడెం బాబు క్యాంపు లోని సీపీఐ కార్యాలయంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూతెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా, గుండెకాయగా ఉన్న సింగరేణికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందని , లక్ష మందితో కళకళలాడే సింగరేణి నేడు కళ తప్పిందన్నారు.కొత్త మైన్స్ రాకపోగా, ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు.కేంద్ర ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా సింగరేణి ప్రాంతంలో ఉన్న బొగ్గు బ్లాకులను సింగరేణికి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యం గట్టిగా నిలబడడం లేదని, సింగరేణిని కాపాడుదామనే ఆలోచన కనిపించడం లేదని విమర్శించారు.కేవలం లాభం కోసమే ప్రయత్నిస్తున్నారు, సింగరేణి ప్రాంతంలో సింగరేణి మనుగడకే ప్రశ్నార్థకంగా ప్రభుత్వం యాజమాన్యం తీరు ఉన్నదన్నారు.సంస్థ తన బొగ్గు ఉత్పత్తి అంశాన్ని పక్కన పెట్టి ప్రభుత్వ సూచనల మేరకు లాభాలే లక్ష్యంగా సోలార్, విండ్ పవర్, ఐరన్ ఓర్ ఉత్పత్తుల పట్ల దృష్టి పెట్టి ఇతర రాష్ట్రాల్లో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నదని దీంతో సింగరేణి ఉనికే ప్రశ్నార్థకంగా మారిందన్నారు.సంస్థలో ఎంతో కాలంగా పనిచేసి శ్రమించిన కార్మిక కుటుంబాలకు ఎటువంటి ప్రత్యామ్నాయం చూపించకుండా దౌర్జన్యంగా వెళ్ళ గొడుతున్నారని, ఇదేమైనా దిక్కులేని రాష్ట్రమా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంట్రాక్టు కార్మికుల వేతనాలు నికృష్టంగా ఉన్నాయని తెలిపారు.
సింగరేణి సిఎండి బలరాం మంచివాడే అయినా ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం
నడుచుకుంటున్నారని, సింగరేణిలో గత ప్రభుత్వం లాగే రాజకీయ జోక్యం పెరిగిపోయిందని తీవ్రంగా విమర్శించారు.సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ..సింగరేణి నేడు త్రిశంకు స్వర్గంలో ఉన్నదని, అసలు దీనికి బాధ్యులు ఎవరూ లేని పరిస్థితి ఉన్నదని విమర్శించారు.సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కు ముందుగా అనే ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సి ఉండగా గత రెండు నెలలుగా ఎక్స్టెన్షన్ రేపు రేపు అనుకుంటూ కాలయాపన చేశారని, డైరెక్టర్స్ గా ఉన్నవాళ్లకు ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు, కొత్త వారికి ఇంటర్వ్యూ జరగలేదని, ఇవాళ సింగరేణిలో డైరెక్టర్ లేరని విమర్శించారు.దీంతో కార్మికుల సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని, ప్రొడక్షన్ కూడా సరిగా రావడం లేదన్నారు.దీనికి సరైన బాధ్యులు లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తున్నదన్నారు.
వంద సంవత్సరాల సింగరేణి చరిత్రలో ఈ విధంగా డైరెక్టర్స్ లేకుండా సీఎం &ఎండీ కి ఎక్స్టెన్షన్ ముందే ఇవ్వకుండా జరిగిన పరిస్థితి ఏనాడు లేదన్నారు.కాబట్టి తక్షణమే దీనిని పరిష్కారం చేస్తేనే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.సింగరేణి ఎన్నికలు జరిగి సంవత్సరం గావస్తున్నా గుర్తింపు కార్మిక సంఘంతో చైర్మన్ స్థాయి సమావేశం ఇంతవరకు జరగలేదన్నారు.ఎన్నికల కోడ్ పేరుతో కార్మిక సంక్షేమాన్ని విస్మరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.సింగరేణి కార్మికులకు సొంతింటి పథకానికి 200 గజాల స్థలం ,25 లక్షల రూపాయల వడ్డీ లేని బ్యాంకు రుణాలు ఇప్పిస్తే, కార్మికులకు క్వార్టర్స్ నిర్మించాల్సిన అవసరం ఉండదని తెలిపారు.కాంట్రాక్ట్ కార్మికులకుకోల్ ఇండియాలో హై పవర్ వేతనాలు ఇస్తుంటే సింగరేణిలో వేతనాలు సరిగా ఇవ్వడం లేదని అన్నారు.కోడ్ ఆఫ్ డిసిప్లిన్ లేకుండా గుర్తింపు కార్మిక సంఘంతో సంప్రదింపులు లేకుండా యాజమాన్యం కేవలం ప్రభుత్వం సూచనలు మేరకే నడుచుకుంటున్నదని విమర్శించారు. గుర్తింపు కార్మిక సంఘంతో సింగరేణి సీఎండీ స్థాయి సమావేశం నిర్వహించకపోవడం, గుర్తింపు కార్మిక సంఘాన్ని పట్టించుకోకపోవడం దారుణమని, అలాంటప్పుడు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించడం ఎందుకని ప్రశ్నించారు.సింగరేణి యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక హక్కుల కోసం సంక్షేమం కోసం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.కేంద్ర కమిటీ నాయకులు, వివిధ బ్రాంచీల కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య కే రాజ్ కుమార్ ఏం వెంకటస్వామి మిర్యాల రంగయ్య కే సారయ్య వైవి రావు బాజీ సైదా వై రాంగోపాల్ వి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు