ఆసుపత్రి డిప్యూటీ మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ వి.శేఖర్
జనం న్యూస్ జనవరి 21 ప్రతినిధి ఎండీ జహంగీర్
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో మంగళవారం నాడు నిర్వహించిన ఆరోగ్య మహిళా ప్రత్యేక ఆరోగ్య, వైద్య శిబిరం విజయవంత మైనట్లు డిప్యూటీ సూపర్డెంట్ డాక్టర్ వి.శేఖర్ తెలిపారు.ఆయన మాట్లాడుతూ ప్రతి మహిళ జీవితకాలం ఆరోగ్యంగా ఉండుటకు ముందస్తుగా వారి సాధారణ ఆరోగ్యం, గర్భాశయ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.స్త్రీ వైద్య నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ నీలిమ, ప్రొఫెసర్ డాక్టర్ సుప్రియ వైద్య బృందం ఈరోజు వచ్చిన 190 మంది మహిళలకు ప్రత్యేకంగా పలు ఆరోగ్య, వైద్య పరీక్షలు నిర్వహించారు.59 మందికి గర్భస్థ సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.వీరికి ప్రత్యేకంగా మూత్ర రక్త పరీక్షల తో పాటు అల్ట్రా సౌండ్ స్కానింగ్, గర్భాశయపు క్యాన్సర్, మూత్ర,రక్త పరీక్షలు నిర్వహించారు.చికిత్స తో పాటు అందుబాటులోని మందులు ఆస్పత్రిలో ఉచితంగా అందజేశారు. ఆసుపత్రికి వచ్చిన ప్రతి గర్భిణీ ఆరోగ్యంగా ఉండేటట్లు ప్రత్యేకంగా స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ సౌమ్య, డాక్టర్ శ్రీవాణి, డాక్టర్ శృతి, డాక్టర్ శ్రావణి, డాక్టర్ కావ్య డాక్టర్ సుదీప్తి, డాక్టర్ మని, డాక్టర్ శిరీష వారిని పరీక్షించి పలు సూచనలు, చికిత్సలు అందించారు. ప్రతి గర్భిణీ సుఖ ప్రసావం పొందే విధంగా చర్యలు తీసుకున్నారు.గర్భస్థ సమయంలో,ప్రసవ సమయంలో,ప్రసవానంతరం ఆరోగ్య జీవితం ఉండేందుకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. గర్భస్థ సమయంలో 102 అంబులెన్స్ ప్రతి గర్భిణీ వినియోగించుకోవాలని సూచించారు.పురిటి నొప్పులు వచ్చినప్పుడు, ఫిట్స్, బిపి, ఇతర ఆరోగ్య అత్యవసర సమయంలో రవాణాకు గర్భిణీలు తప్పనిసరిగా 108 అంబులెన్స్ సేవలు ఉచితంగా వినియోగించుకోవాలని ప్రత్యేకంగా సూచించారు. ప్రతి గర్భిణీ హెల్ప్ డెస్క్ సేవలు వినియోగించు కోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపర్డెంట్ మంజుల, హెడ్ నర్స్ పద్మ,నర్సింగ్ అధికారులు ఎం.ఆనంద్, లలిత,రజిత,పద్మ, చిన్న చిన్నమ్మ, సుబేదా, పద్మావతి,రేణుక హెల్ప్ డెస్క్ ఇంచార్జ్ టి. యాదగిరి,సుజాత, అనితా, జ్యోతి, విజయలక్ష్మి,తదితరులు పాల్గొన్నారు.


