Listen to this article

జుక్కల్ జనవరి 21 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో బి ఆర్ఎస్ యువ నాయకుడు కాంబ్లె కిరణ్ గుండెపోటుతో అకాలంగా మరణించడం అత్యంత విషాదకరం.ఈ విషయం తెలుసుకున్న వెంటనే జుక్కల్ నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే గారు కిరణ్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి బాధను పంచుకున్నారు. కన్నీటి వీడ్కోలు పలికుతూ, కిరణ్ మరణం పార్టీకి, యువతకు తీరని లోటు అని తెలిపారు.అనంతరం కాంబ్లె కిరణ్ పాడేను మోసి, చివరి వీడ్కోలు పలికారు.ఈ అంత్యక్రియలలో జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే మరియు వారి తనయుడు హరీష్ షిండే పాల్గొని నివాళులర్పించారు.కిరణ్ అంత్యక్రియల సందర్భంగా జుక్కల్ బి ఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి, వేదనతో ఘనంగా వీడ్కోలు పలికారు.అలాగే జుక్కల్ మండలంలోని అన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కాంబ్లె కిరణ్‌కు శ్రద్ధాంజలి ఘటించారు.కాంబ్లె కిరణ్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని భరించే శక్తి ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్తించారు.