Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 06: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలములోని తాళ్ళ రాంపూర్ లోగురువారం రోజునా నందిపేట్ (పలుగుట్ట)బాలయోగి రాములు మహారాజు బద్దం దేవేందర్ ఇంటి పైన పిరమిడ్ ధ్యాన మందిర నిర్మాణం కొరకు భూమి పూజ చేశారు. మహారాజు మాట్లాడుతూ మానవ జీవితంలో84వేల జీవరాసులలోమానవజన్మ చాలా ఉత్తమమైనది. ఈ ప్రాణి మంచి, చెడులను చూస్తున్నది. దేవుడు విగ్రహ రూపంలో మాత్రమేఉన్నాడు అనుకోవద్దు.మనిషిలో భగవంతుడు ఉంటేనే మాట్లాడుతున్నాం, కదులుతున్నము, దాన ధర్మాలు చేస్తున్నాం.భగవంతుడు ఒక్క క్షణంలో ప్రక్కకు పోతే ప్రాణి దేనికి పనికి రాదుఅని గ్రహించాలి అన్నారు.మాతృ దేవోభవ పితృ దేవో భవ అంటారు భగవంతుని రూపంలోమనకు జన్మని ఇచ్చినతల్లితండ్రులనుగౌరవించాలి. ఇటుఅత్తమామలనుమంచిగా చూసుకోవాలి. మానవుడు మాదవుడుగామారాలి. పుట్టినపుడు ఒకరిగా వచ్చినాము, చచ్చిన తర్వాత ఒక్కరిగా పోతాం మనతో ఎవ్వరు రారు. నాది, నీది ఇది కేవలం ఆత్మ ఉన్నవరకే అందుకే మంచిధర్మంలోనడవాలి .స్త్రీలకుపరమాత్ముడు పురుషుడు ఐతే పురుషుడికి పరమాత్ముడు తల్లితండ్రులు అని గ్రహించాలి అని మాట్లాడారు. బద్దం దేవేందర్ 7సంవత్సరాల నుండి ద్యానం మందిరం పై తన మనస్సును నిమగ్నం చేసి దానిలో ఉన్న శక్తినీ గ్రహించి పిరమిడ్ నిర్మాణము చేస్తున్నాడు అంటే మీరు అర్థం చేసుకోవాలి అన్నారు.శ్వాస మీద ధ్యాస ఉంటే ఎటువంటి అనారోగ్యం గురి కాకుండా ఉంటాం అని అన్నారు.జిల్లా పిరమిడ్ ధ్యాన మందిర అధ్యక్షుడు సాయికృష్ణ రెడ్డి మాట్లాడుతూ కుంభమేళాలో 5000వేల భక్తులకు సాంబారుఇడ్లి మహారాజు ఆధ్వర్యంలోఅక్కడ 20మంది భక్తులను ఉంచి తయారు చేసి ఇవ్వడం జరుగుతోంది అన్నారు.ఇడ్లి తిన్న తర్వాత భక్తులు ఇడ్లి బాబాఎక్కడ అని అంటున్నారు. మహారాజు ఏ కార్యమైనా నలుగురి సహాయపడాలనే కాంక్ష ఉంటుంది అన్నారు. బద్దం దేవేందర్ మాట్లాడుతూ నేను 7సంవత్సరాల నుండి పిరమిడ్ మందిరం లోఉండి ద్యానం చేశాను. బయట ఉండి ద్యానం చేసే బదులు ధ్యాన మందిరంలో ద్యానం చేయడం వలన 3రేట్ల విశ్వంలోఉన్నశక్తిని నేను స్వయం గ్రహించాను.అందుకే ధ్యాన మందిరం నిర్మిస్తున్నాను అన్నారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.