చట్టం న్యూస్ బిచ్కుంద బిచ్కుంద పట్టణంలోని మార్కండేయ జయంతిని పురస్కరించుకొని బిచ్కుంద పట్టణంలోని మార్కండేయ స్వామి ఆలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బుధవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాన్సువాడ డివిజన్ అధ్యక్షుడు డాక్టర్ రాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం భక్తులతో కలిసి పల్లకి సేవలో పాల్గొని ఆలయ ప్రాంగణాన్ని భక్తిమయంగా మార్చారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు మాట్లాడుతూ, మార్కండేయ స్వామి భక్తి, ధర్మ పరిరక్షణకు ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, శాంతిని పెంపొందిస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షునితోపాటు బిచ్కుంద మండల అధ్యక్షుడు హనుమాన్లు పట్టణ అధ్యక్షుడు చందు, డాక్టర్ నరసింహులు భూమయ్య నారాయణ పద్మశాలి సంఘ నాయకులు, పట్టణ ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



