Listen to this article

జనం న్యూస్- ఫిబ్రవరి 7- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:-నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ నాలుగవ వార్డ్ కు చెందిన దుబ్బ ముత్తయ్య ఐదవ వార్డుకు చెందిన వి శ్రీను ఇటీవల కాలంలో అనారోగ్యానికి గురవడంతో సీఎం రిలీఫ్ ఫండ్ కు అప్లై చేసుకోగా వచ్చిన వి శ్రీనుకు చెందిన 38 వేల చెక్కును దుబ్బా ముత్తయ్య కు చెందిన 30 వేల రూపాయలు చెక్కును మాజీ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి బాధితులకు అందజేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ పేదవారికి ఆసరాగా ఉంటుందని తెలిపారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉంగరాల శ్రీనివాస్, చిన్ని, జనార్దన్ ,మాయకోటి శంకర్, యువజన కాంగ్రెస్ నాయకులు ఎర్రబోయిన సురేష్, షేక్ ఖాసిం, సల్మాన్, రాజ్ ,శివ, శీను, సోషల్ మీడియా కోఆర్డినేటర్ మద్దాల భాను, రాములమ్మ, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.