

జనంన్యూస్. 07.నిజామాబాదు. ప్రతినిధి.( శ్రీనివాస్)నిజామాబాదు.భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ. మాట్లాడుతు.తెలంగాణ ప్రభుత్వం కులగణన గొప్పగా చేసాము, మా అంత గొప్ప పార్టీ,గొప్ప నాయకులు దేశంలో ఎవరు లేరన్నట్టు అసెంబ్లీ లో తీర్మానం పెడుతున్నాం అని బీసీ వర్గం ప్రజలను మోసం చేసే కుట్ర అసెంబ్లీలో జరిగిందన్నారు.రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీ సోదరి, సోదరిమనుల ఓట్ల కోసం కాంగ్రెస్ చేసిన పెద్ద డ్రామా అని గత ప్రభుత్వం లెక్కల ప్రకారం 1.85 కోట్ల పైగ అంటే 51% ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ లెక్కల ప్రకారం 1.65 కోట్లు అంటే 46.25% నిర్ణయించిందని మరి దాదాపు 21 లక్షల బీసీలు ఏమైనారు అని ప్రశ్నించారు 10 ఏళ్ల నుండి బీసీలు ఏమైనా అంతరించిపోతున్న వర్గంగా ప్రభుత్వం భావిస్తుందా ప్రశ్నించారు.దీని వల్ల లక్షల బీసీ కుటుంబాలు తమ రిజర్వేషన్ కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.అసలు ఈ బీసీ కులగనన పేరుతో కాంగ్రెస్ ఒక పెద్ద కుట్ర చేయబోతుందని అది అందరు గమనించాలన్నారు 10. 8% బీసీ ముస్లిం అని వారిని బీసీలో కలిపే కుట్రకు కాంగ్రెస్ పునుకుందన్నారు. కాంగ్రెస్ నాయకులు బీసీ బిడ్డలకు ఈవిదంగా అన్యాయం చేస్తా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్న.హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అనేది ఉంటుందా…?ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి & మంత్రివర్గం మతిలేని చేష్టలు చేస్తూ తెలంగాణ బిడ్డలను మోసం చేస్తున్నారు
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ తీర్మానం చేసినం కేంద్రం అమోదించాలి అంటే అడ్డమైన తీర్మానాలు చేసి కేంద్రానికి పంపితే కేంద్రం ఎందుకు అమోదిస్తుందని ప్రశ్నించారు.బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేయాలి దానికి మేము వ్యతిరేకం కాదని కానీ బీసీ కులగనన పేరుతో మైనారిటీ వర్గాన్ని బీసీలో కలిపే కుట్ర చేసినట్లు మాకు అనుమానం వస్తుందని ముందు ప్రభుత్వం దానికి స్పష్టం చేయాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగనన ఓ తప్పుల తడక అనడానికి ఆ పార్టీ ఎమ్మెల్సి తీన్మార్ మల్లన్న. ఆ రిపోర్ట్ ను తగలబెట్టడమే అందుకు నిదర్శనం అన్నారు, తూ తూ మంత్రాంగ నిర్వహించిన సర్వే కాకుండా నిజమైన బీసీల లెక్కలు తేల్చలని డిమాండ్ చేసారు.కాంగ్రెస్ కు బీసీ బిడ్డల పైన నిజంగా చిత్త శుద్ధి ఉంటే మంత్రి వర్గంలో బీసీలకు ఎందుకు సమూచిత న్యాయం కల్పించలేకపోతున్నారో సమాధానం చెప్పాలన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలు ఏమైనాయి అవి ఏ గంగలో కలిపారో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోని 15 వ పేజీలో హామీ ఇచ్చిన విధంగా – ఐదేళ్లలో బీసీల సంక్షేమ కోసం సంవత్సరానికి 20 వేల కోట్ల చొప్పున ఐదు సంవత్సరాలలో లక్ష కోట్లు ఖర్చుపెడతామని హామీ ఇచ్చారు కానీ 2024-25 ఆర్ధిక సంవత్సరానికి కేవెలం 8 వేల కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్‌లో కేటాయించనందుకు కాంగ్రెస్ ప్రభుత్వం బిసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.నిజంగానే బీసీలపై ప్రేమ ఉంటే రాబోయే బడ్జెట్ లో ఇచ్చిన హామీ ప్రకారం 20వేల కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేసారు.మహాత్మా జ్యోతిరావు పులే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు హామీ ఎందుకు నెరవేర్చలేదన్నారు కనీసం మొన్న జరిగిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో సబ్ ప్లాన్ అయినా ఏర్పాటు చేస్తారు అంటే అది లేకపోయే అని విమర్శించారు.బీసీ యువత ఉన్నత విద్య, ఉపాధికి వడ్డీలేని 10 లక్షల రుణాల ఊసే లేకపోయే అన్నారు. అంతే కాకుండా మూడు లక్షల రూపాయల ఆదాయమున్న ప్రతి బీసీ కుటుంబానికి పూర్తి ఫీజు రీయంబర్స్‌మెంట్ ఇస్తా అన్న హామీ ఏమైందన్నారు. ఇప్పటివరకు 6వేల కోట్ల బకాయితొ బీసీ బిడ్డలను చదువుకు దూరం చేసే కుట్ర తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ విద్యార్థులకు చేసింది ఏమి లేదని మండిపడ్డారు.బీసీ స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేసి బీసీ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసారు.ప్రతి మండలంలో ఒక గురుకులం అన్నారు. దాని పురోగతి ఏంటో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ గురుకుల డిగ్రీ కాలేజ్ అన్నారు.. సంవత్సరం గడిచిన వాటి ఊసే లేదన్నారు.బీసీలకు 10 లక్షల వడ్డీ లేని రుణమిస్తా అని చెప్పారని.. ఒక్క బీసీ బిడ్డకు అయినా రుణం ఇచ్చారా ? ఒకవేళ ఇస్తే ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో బీసీ కన్వెన్షన్ హాల్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు ఒక్కదానికైనా కనీసం శంకుస్థాపన చేసారా అని ప్రశ్నించారు.ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో 2వ దశ గొర్ల పంపిణీ ఏమైందన్నారు,గౌడన్నలకు 5 ఎకరాలు భూమి ఈత వనాల కోసం ఇస్తామన్నారు ఎంతమంది గౌడ అన్నలకు ఇచ్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రిజర్వేషన్ అంశంతో రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా చిత్తశుద్ధి అంతే బీసీలకు ఇచ్చిన హామీలు అన్ని అమలుచేసి ప్రజాశేత్రంలో ఓట్లు అడగాలని డిమాండ్ చేసారు.బీసీలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చకుంటే రేవంత్ సర్కార్ ను బీసీ బిడ్డలు కూల్చడం ఖాయం అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.