Listen to this article

జనం న్యూస్ జనవరి 21: నిజామాబాద్ జిల్లా

ఏర్గట్లమండలం,:రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో తాడ్పకల్ గోదావరి పుష్కర ఘాట్‌ను అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేయాలని తడపాకల్ గ్రామ సర్పంచ్ జింక స్వప్న అనిల్ కుమార్ జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్కను కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సూచన మేరకు దేవాదాయ శాఖ అధికారులు పుష్కర ఘాట్ విస్తరణకు రూ.2.76 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు.పార్కింగ్ కోసం ఆలయానికి ఆనుకుని ఉన్న పట్టాభూమి కొనుగోలు, రామాలయం–హనుమాన్ ఆలయాల సుందరీకరణ, డార్మిటరీ హాల్, ఆధునిక రెస్ట్ హౌజ్ నిర్మాణం, గ్రామం నుంచి గోదావరి వరకు రోడ్డు విస్తరణతో సెంట్రల్ లైటింగ్, భక్తుల కోసం టాయిలెట్ల నిర్మాణం, గోదావరి తీరంలో గంగమ్మ ఆలయం, భారీ హనుమాన్–శివ విగ్రహాల ఏర్పాటు వంటి పనులు చేపట్టాలని కోరారు. వ