Listen to this article

డి ఈశ్వర్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు

జనం న్యూస్/జనవరి 11/కొల్లాపూర్ శుక్రవారం ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కొల్లాపూర్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నుండి పాదయాత్రగా వెళ్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ధర్నా చేసి అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆశా వర్కర్లతో కలిసి క్యాంపు కార్యాలయ సిబ్బంది రమేష్ కి ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ ఆశా వర్కర్లకు పారితోషకం కాకుండా పిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. పిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు ఇచ్చేంతవరకు దశల వారి పోరాటాలు నిర్వహిస్తామని ఆయన ప్రభుత్వానికి తెలిపారు. ఎన్నికల ముందు ఆశా వర్కర్లకు గత ప్రభుత్వం కంటే మూడు అంతలు రెట్టింపుగా ఇస్తామని వాగ్దానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కళావతి, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీదేవి, శివ లీల, గౌరమ్మ,వీపన్ గండ్ల ఆశ నాయకురాలుసుజాత చిన్నంబావి ఆశ నాయకురాలు,లక్ష్మీదేవి,, ఓకుల, వెంకటమ్మ, శివ లీల, మమత, కొల్లాపూర్,పెంట్లవెల్లి, పెదకతపల్లి, చిన్నంబాయి, వీపనగండ్ల ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.