Listen to this article

జనం న్యూస్ 07 ఫీబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్యం : అర్ పి ఎస్ .ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా కార్యదర్శి ఇరుగు శ్రీను అధ్యక్షతన జరిగినది. ఈ కార్యక్రమంలో యం అర్ పి ఎస్ జాతీయ కార్యదర్శి కోండ్ర ఎల్లయ్య గారు పాల్గొని మాట్లాడుతూ. తెలంగాణలో యస్ సి ల ఏ బి సి డి వర్గీకరణ చేస్తానని మాట ఇచ్చి కొందరి స్వార్థపరుల మాటలు విని రిజర్వేషన్ తగ్గించడం మాదిగ మాదిగ ఉపకులాలను మోసం చేసినట్లే అవుతుందని ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పునరా లోచించి మా జనాభా ప్రకారం మాకు రిజర్వేషన్ శాతం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. కమిషన్ నివేదిక ప్రభుత్వానికి సమర్పించినప్పుడే మార్పు చేశారని యస్ సి లో ఉన్న 59 కులాలకు సంబంధం లేదా పంబా కులం బుడిగే జంగం ఇలాంటి అన్ని కులాలను ఎ గ్రూపులో చేర్చి మా జాతులకు అన్యాయం చేశారని ఈరోజు హైదరాబాదులో రాష్ట్ర కమిటీ సమావేశంలో యం అర్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగిందని 11% శాతం రిజర్వేషన్ కల్పించేంతవరకు పోరాటం ఆపేది లేదని డిమాండ్ చేస్తూ. ఇప్పటి మాదిగ మాదిగ ఉపపురాలలో వున్న M.L.A లు M.P లు నోరు మెదపకపోవడం మాదిగ జాతికి నష్టం చేసినట్లు అవుతుందని ఇప్పటికైనా MRPS వ్యవస్థాపకులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు MRPS రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య నిర్ణయాలకు M.L.A లు M.P లు చొరవ తీసుకొని జాతి ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా పోరాటంలో కలిసి రావాలని డిమాండ్ చేస్తూ. ఈనెల 7న జరుగు లక్ష డప్పులు వెయ్యి గొంతుల సాంస్కృతిక కార్యక్రమానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవడం బాధాకరమని అవసరమైతే రాష్ట్ర కమిటీల పిలుపుమేరకు కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుని అయిన సాంస్కృతిక సభ జరిపించి తీరుతామని పిలుపునిస్తున్నాం. రాబోయే ఈ చివరి పోరాటంలో మాదిగలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తున్నాం.ఈ కార్యక్రమంలో నాయకపోడు సేవా సంఘం జిల్లా అధ్యక్షులు పులి శ్రీను, మహజన మహిళ సమాఖ్య జిల్లా కార్యదర్శి CH. రాధ,MRPS అధ్యక్షురాలు కుక్కలసుధారాణి,జయ,సంధ్య,జ్యోతి, ఎల్లమ్మ, బాలరాజు, బాలకృష్ణ, సతీష్,భాస్కర్,శ్రీను,రాజు తదితరులు పాల్గొన్నారు.మీ సామాజిక ఉద్యమ నేతదళితరత్న కోండ్ర ఎల్లయ్యMRPS జాతీయ కార్యదర్శిడా.బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత, మహబూబాబాద్ 🙏🙏🙏