

SRS యూత్ ఆధ్వర్యంలో యువకులకు వాలీబాల్ కిట్టును అందచేసిన ఎస్ఐ నరేష్
జనం న్యూస్ 7ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామంలోశివరామసాయి యూత్ వెల్ఫేర్ సొసైటి వ్యవస్థాపక అధ్యక్షుడు గుర్లే శ్రీనివాస్ అధ్వర్యంలోఎష్టి కాలనిలోని క్రీడాకారులకు యువకులకు వాలీబాల్ కిట్టును చింతలమానేపల్లి ఎస్ఐ ఇస్లావత్ నరేష్ చేతుల మీదుగా అందచేశారు.ఈ సందర్భంగా ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ..
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంతోపాటు వ్యక్తుల మధ్య పోటీతత్వం పెంచుతాయని క్రీడలవల్ల యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారని తెలిపారు.యువతను నియోజక వర్గానికిఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా గత కొన్ని సంవత్సరాల నుండి శ్రీ శివరామసాయి యూత్ వెల్ఫేర్ సొసైటి అధ్వర్యంలో క్రీడపోటీలు నిర్వహిస్తూ క్రీడాకారులకు క్రీడ సామాగ్రిని అందిస్తున్న యూత్ అధ్యక్షుడు శ్రీనివాస్ ను యూత్ సభ్యులను ఎస్ఐ అభినందించారు.ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు గుర్లె శ్రీనివాస్ మాజీ సర్పంచ్ కుమ్రం పరదేశి యూత్ సభ్యులు జాగరి శ్రీశైలం విలాస్ మరియు యువ నాయకులు జుమిడి సాగర్ దినేష్ డోంగ్రి సంతోష్ మున్నాభాయ్ నాగేస్ హరీశ్ ప్రభాకర్ గ్రామస్థులు యువకులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.