Listen to this article

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 22 జనవరి

ఈ సందర్భంగా మాట్లాడుతూ. గడిచిన బీఆర్‌ఎస్ పాలన కాలంలో జహీరాబాద్ పట్టణంలో జరిగిన అభివృద్ధి మీ ముందే ఉందని , అభివృద్ధి అనేది ఒక రోజు జరిగేది కాదని, అది నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు .బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి వార్డులో సగటున రూ.కోట్ల వరకు అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా కేసీఆర్ నాయకత్వంలో పేదల సంక్షేమం కోసం ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని గుర్తు చేశారు.అసాధ్యమైన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తూ కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిందని విమర్శించారు . “ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్ముతారు” అని రేవంత్ రెడ్డి బహిరంగంగానే చెప్పిన విషయం ప్రజలకు గుర్తుండాలన్నారు. అబద్ధాలకు అంబాసిడర్‌గా రేవంత్ రెడ్డి మారారని తీవ్రంగా మండిపడ్డారు.రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, అబద్ధపు హామీలతోనే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ వెళ్తోందని ఆరోపించారు . రేవంత్ రెడ్డి నోటి దుర్భాష భరించలేనిదిగా మారిందని, నోటికి మొక్కాలి అన్న స్థాయికి వెళ్లిందన్నారు.ప్రతి ఇంటికి, ప్రతి గడపకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ‘ కాంగ్రెస్ బాకీ కార్డులు’ పంపిణీ చేస్తామని ప్రకటించారు . ఈ ఎన్నికల్లో 37 వార్డుల బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.26 నెలల్లో అభివృద్ధి లేకుండా కేసీఆర్, కేటీఆర్, హరీష్‌ రావు గార్లలపై విమర్శలే రేవంత్ మాటల వల్ల పిల్లలు చెడిపోతారని టీవీ చూడనివ్వని తల్లిదండ్రులు అన్ని వర్గాల నాయకులు, కార్యకర్తల సమన్వయంతో రానున్న ఎన్నికల్లో పట్టణంపై గులాబీ జెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మాజి మున్సిపల్ చైర్మన్ తంజిం,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,
ఆర్ సుభాష్ ,గడ్డం జనార్ధన్, మహిళ పట్టణ అధ్యక్షురాలు మంజుల, అనుషమ్మ, వెంకట్,విశ్వేశ్వర్, బరూర్ దత్తాత్రి , వెంకట్ సాగర్, నసీర్,ఇబ్రహీం, తదితరులు పాల్గొన్నారు….