జనం న్యూస్ జనవరి 22 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
ప్రసిద్ధి చెందిన అనకాపల్లి లో 171 సంవత్సరాల చరిత్ర కలిగిన వేల్పుల వీధి శ్రీ గౌరీ పరమేశ్వరి మహోత్సవం ఈనెల 24 తేదీ శనివారం పండగ సందర్భంగా. గురువారం వేల్ఫుల వీధి మహిళలందరూ ఇంటి వద్ద తయారుచేసిన వివిధ రకాల పిండి వంటలను తయారుచేసి అమ్మవారి కి సమర్పించి సారి ఊరేగింపు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ గరికి వెంకట్రావు సెక్రటరీ నానేపల్లి రవి, కోశాధికారి పోతల రమణ ఉత్సవకమిటీ సభ్యులు వేల్పుల వీధి పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.//


