

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.అన్నమయ్య జిల్లా S.P మౌఖిక ఆదేశాల మేరకు, రాజంపేట సెల్ డివిజనల్ పోలీసు అధికారి మనోజ్’ రామ్ నాథ్ హెడ్గే మరియు రాజంపేట రూరల్ ఇన్స్ఫెర్డ్షైర్ B.V.రమణ సూచనల మేరకు, నందలూరు సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు కి వారికి రాబడిన ఖచ్చితమైన మరియు నమ్మతమైన సమాచారం మేరకు, పంచాయతీదారులు మరియు నందలూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది తోటి. అన్నమయ్య జిల్లా, నందలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కడప- తిరుపతికి వెళ్ళు నేషనల్ హైవే ప్రక్కన ఉన్న పాత అలీన్ ఫ్యాక్టరీ గేటు వద్దకు ఈ దినం అనగా 07.02.2025 వ తేదిన ఉదయం 11.30 గంటలప్పుడు వెళ్ళగా, అక్కడ 1) తలారి బాలక్రిష్ణ, 40 సం. తండ్రి నాగప్ప, కులం: వాల్మీకి (బోయ్), వృత్తి: బెల్టారి పని, నివాసం: రాంనగర్, రాజంపేట టౌన్ మరియు మండలం, 2) పుర్లగుంట రామాంజి రామాంజనేయులు కోడిగాడు. 34 సం. తండ్రి మద్దిలేటి. కులం: వాల్మీకి (బోయ), వృత్తి: కూలిపని, అలంకొండ గ్రామం. క్రిష్ణగిరి మండలం, కర్నూల్ జిల్లా అనువార్లు తెల్లటి సంచిని పట్టుకొని ఉండి, పోలీసు లను చూసి పారిపోవుటకు ప్రయత్నించగా, నందలూరు ఎస్పై మరియు సిబ్బంది ఆ ఇద్దరు వ్యక్తులను వెంబడించి పట్టుకొని, వారి వద్ద నుండి 1,442.33 (1.42 KGs) గ్రాములు బరువు గల సుమారు 99.000/- రూపాయలు విలువ చేసే మూడు వెండి కిరీటములు, రెండు వెండి పల్లెములు. ఒక శతగోపము మరియు మూడు వెండి దీపాలను స్వాదీన పరుచుకొని, 24.12.2024 వ తేదీ రాత్రి సమయములో నందలూరు మండలం, ఆడపూరు గ్రామ సమీపమున గల మంచాలమ్మ గుడిలో దొంగిలించబడిన వస్తువులుగా గుర్తించి, పైన కనబరచిన ఇద్దరినీ నందలూరు పోలీసు స్టేషన్ Cr. No. 169/2024 U/s 331(4), 305 BNS (గుడి దొంగతనం) కేసులోని ముద్దాయిలుగా గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడమైనది. ఈ కార్యక్రమంలో నందలూరు ఎస్సై వెంకటేశ్వర్లు ఏఎస్ఐలు సుబ్బరాయుడు,శంకర్ నాయక్, మరియు రాజగోపాల్ మహేంద్ర దర్బార్ రామకృష్ణ వర్మ,మరియు పాత్రికేయులు పాల్గొన్నారు.స్వాధీనము చేసుకొన్న వస్తువులు:-1,442.33 (1.42 KGs) గ్రాములు బరువు గల సుమారు99,000/-రూపాయలు విలువ చేసే మూడు వెండి కిరీటములు, రెండు వెండి పల్లెములు, ఒక శతగోపము మరియు మూడు వెండి దీపాలు.