జనం న్యూస్ జనవరి 22 ముమ్మిడివరం ప్రతినిధి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం టౌన్ సమావేశం టౌన్ అధ్యక్షులు సన్నిధి రాజు వీరభద్రస్వామి అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశమునకు ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ హాజరైనారు నూతనముగా ఎన్నికైన టౌన్ అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మిగతా కార్యవర్గాన్ని ప్రకటించారు త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసే విధంగా బూత్ కమిటీలు నిర్మించాలని సూచించారు ఈ సమావేశమునకు ముమ్మిడివరంటౌన్ ఇంచార్జ్ ఇళ్ల సత్యనారాయణ జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ రాష్ట్ర మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి హుస్సేన్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొల కోటి వెంకటరెడ్డి, దంగుడు బియ్యం శ్రీనివాసరావు ,బసవ శ్రీహరిబాబు, అల్లూరి సత్యనారాయణరాజు, కర్రీ కృష్ణ, తట్టవర్తి నాగరాజారావు, కొడమర్తి వెంకట రత్నశర్మ గోపాలకృష్ణ ,శాంతిశ్రీ, మండల ఉపాధ్యక్షులు మండల ప్రధాన కార్యదర్శి, బూత్ అధ్యక్షులు,
సీనియర్ నాయకులు , తదితరులు పాల్గొన్నారు



