జనం న్యూస్ జనవరి 22 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలందరికీ రక్షిత మంచినీటి సరఫరా కోసం అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్న అనకాపల్లి మండలము, మరియు కసింకోట మండలము నందు జరుగుతున్న గ్రామీణ మంచినీటి సరఫరా పనులలో భాగంగా జిల్లా కార్యనిర్వక ఇంజనీరు జే. అనిల్ కుమార్ అనకాపల్లి సబ్ డివిజన్ నందు జరుగుతున్న పనుల పురోగతి తెలుసుకొని వాటిని పూర్తిచేసే దిశలో చర్యలు తీసుకోవడం జరిగిందని, నియోజకవర్గానికి 28.77 కోట్లు రూపాయలతో 184 వర్కులకు గాను పూర్తయిన పనులు 106 , ప్రస్తుతం జరుగుతున్న పనులు 78 సకాలంలో పూర్తి చేసి రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఇంటికి కులాయి వెయ్యడమే లక్ష్యముగా క్షేత్రస్థాయిలో పరిశీలించి పనులు జరిపే విధంగా దిగువ స్థాయి అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగినది. అదేవిధంగా మండలంలో మంచినీటి పథకములు మరమ్మత్తులు, సమ్మర్ క్రాస్ ప్రోగ్రామ్ని నిర్వహించవలసిందిగా తెలియపరచడం జరిగినది. అనిల్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి పి ఎల్ న్ ప్రసాద్, డి ఈ ఈ, ఆర్డబ్ల్యూఎస్, అనకాపల్లి, పి. వనజాక్షి, ఏ ఈ ఈ, డివిజన్ ఆఫీసు, అనకాపల్లి, ఏ ఈ ఈ హిమబిందు, ఆర్డబ్ల్యూఎస్, అనకాపల్లి, కె. శ్రీనివాస్, ఏఈ, కశింకోట, సంబంధిత కాంట్రాక్టర్లు హాజరయ్యారు.//


