బిచ్కుంద జనవరి 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం
బిచ్కుంద మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలకు దిశా నిర్దేశక సన్నాహక సమావేశంలో
ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ సావంత్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు,డిసిసి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలు నుండి కాంగ్రెస్ పార్టీ ని నమ్ముకొని కాంగ్రెస్ జెండాను మోసి క్షేత్రస్థాయిలో పనిచేసి, కాంగ్రెస్ పార్టీని బలోపితానికి కృషిచేసిన కార్యకర్తకే రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో వార్డు సభ్యులకు టికెట్టు కేటాయించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు.జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో అందరికీ అవకాశం రాకపోవచ్చు కావున ఎవరికైతే టికెట్టు కేటాయించినము వారిని సాయ సహకారాలు అందించి గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త తీసుకోవాలని అలాగే టికెట్టు ఆశించే భంగపడిన కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తించి మరో మంచి అవకాశాన్ని ఉన్నత స్థాయిలో నిలుపుతామని కార్యకర్తలకు తెలిపారు.ముఖ్య అతిథి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ సావంత్ మాట్లాడుతూ బిచ్కుంద మండల అధ్యక్షులు ధర్పల్లి గంగాధర్ లాంటి కట్టర్ కాంగ్రెస్ కార్యకర్త పార్టీకి అదనపు బలమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని అలాగే దేశంలో జరుగుతున్న బిజెపి మోడీ అరాచక పాలన మీరందరూ గమనిస్తున్నారని అన్నారు . తెలంగాణలో అధికారంలోఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే ఇక్కడ నుండే ప్రారంభించి 2029లో దేశంలో జరగబోయే సాధారణ ఎన్నికల్లో బిజెపి పార్టీని ఓడించాలంటే క్షేత్రస్థాయి నుండి కాంగ్రెస్ పార్టీని బలోపితం చేయవలసిన అవసరము ఎంతైనా ఉందని అది తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రారంభం కావాలని దిశ నిర్దేశం చేసినారు.బిచ్కుందలో మొదటిసారి మున్సిపాలిటీ ఏర్పడిన సందర్భంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం అవశ్యకత ఎంతైనా ఉన్నదని ప్రతీ కార్యకర్త కష్టపడి మున్సిపల్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసినారు. బిచ్కుంద మున్సిపాలిటీలో 12 వార్డు మెంబర్లు ఉన్నాయని అందరికీ అవకాశం రాకపోవచ్చునని అధిష్టానం ఎవరికీ టికెట్టు ఇస్తే అందరూ కలిసికట్టుగా కష్టపడి వాడు మెంబర్ను గెలిపించుకోవాలని కార్యకర్తలకు దిశ నిర్దేశం చేసినారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు డెలికేట్ విట్టల్ రెడ్డి మండల కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు




