Listen to this article

బిచ్కుంద జనవరి 22 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ బిచ్కుంద లోని , ఒకటవ, మూడవ,ఐదవ (I ,III, V)సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలు మరియు రెండవ , నాల్గవ(II ,IV) సెమిస్టర్ బ్యాక్లాగ్ ఫలితాలను గురువారం రోజున తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి (COE) ప్రొఫెసర్ కే . సంపత్ కుమార్ , అడిషనల్ కంట్రోలర్(ACOE) అసిస్టెంట్ ప్రొఫెసర్ శాంతబాయి మరియు డాక్టర్ సంపత్ ల చేతుల మీదుగా తెలంగాణ యూనివర్సిటీలో విడుదల చేశారు .ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ . సి . ఓ.ఈ.డాక్టర్ జి వెంకటేశం , ఏ .సి .ఓ .ఈ .వై. సంజీవరెడ్డి పాల్గొన్నారు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ కె.అశోక్ అభినందనలు తెలిపారు.