Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 07(నడిగూడెం) ఇంటర్ బోర్డు కమిషనర్ ఆదేశాల మేరకు వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల నమోదు కోసం ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల వివరాలు సేకరిస్తూ కళాశాలలో ఉన్న వివరాలను పొందుపరిచిన కరపత్రాలతో నడిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డి విజయ నాయక్ ఆధ్వర్యంలో అధ్యాపకులు ముందస్తు ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం నడిగూడెం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ముందస్తు ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డి విజయ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని పేద విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత సౌకర్యాలను ప్రభుత్వ కళాశాలలో చేరి వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు విద్యార్థుల నమోదు శాతం పెంచేందుకు కృషి చేయాలి అన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ జానీ పాషా మహేష్, వీరన్న, శ్రీనివాసరావు వెంకటేశ్వరరావు, రజిత, మదర్, సుజాత, ధనుంజయ్ హేమ, నాగరాణి ,రవివర్మ తదితరులు పాల్గొన్నారు.