జనం న్యూస్ జనవరి 23 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ జన్మదిన సందర్భంగా శ్రీ శ్రీ నూకాంబికా అమ్మవారికి లోకేష్ కు రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలందరూ సహకారం కుట్రలు కుతంత్రాల నుండి ఎదుర్కొనే విధంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించామని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల సృష్టికర్త యువతకి భరోసా కల్పిస్తున్న యువ నాయకులు నారా లోకేష్ 43వ జన్మదిన సందర్భంగా శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారు ఆశీస్సులు లోకేష్ బాబుకి ఉండాలని, రాష్ట్ర యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విద్య శాఖ మాత్యులు అద్భుతమైన ప్రయత్నాలు చేసి, యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం 20 లక్షల ఉద్యోగాల లక్ష్యoగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి 18 నెలల కాలంలో 26 లక్షల కోట్లు పెట్టుబడులు ఇప్పటికే సాధించారని, దీని మూలంగా రానున్న మూడు సంవత్సరాల్లో 25 లక్షల ఉద్యోగాలు యువతి యువకులకు భరోసా నమ్మకం కలిగించారని నాగ జగదీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీ నూకంబిక దేవస్థానం చైర్మన్ పీలా నాగ శ్రీను మల్ల గణేష్ కర్రి మల్లేశ్వరరావు కాండ్రేగుల వెంకట సూరి గుర్రాల వాసు సారిపల్లి శ్రీనివాసరావు డివివి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


