జనం న్యూస్ :1 జనవరి శుక్రవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జివై. రమేష్ ;
రాజకీయ యోధుడు దేశభక్తుడు అమెరికా విప్లవానికి మూలపురుషుడు ప్రజాస్వామ్య స్వాతంత్ర్య డిక్లరేషన్ పై మొదటిసారిగా సంతకం చేసిన మహానీయుడు వైల్ జాన్ హాంకాక్ జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకునే అంతర్జాతీయ చేతిరాత దినోత్సవం అందరిలో స్ఫూర్తిని నింపాలని ప్రముఖ చేతిరాత నిపుణుడు. క్యాతం అశోక్ అన్నారు జనవరి 23 1977లో డబ్ల్యూ ఐఎంఏ వ్రటింగ్ ఇన్స్ట్రుమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ వారు దీనిని ప్రారంభించారని అప్పటినుండి ప్రతి ఏటా చేతిరాత దినోత్సవం జరుపుకుంటామన్నారు. అందమైన చేతిరాత వల్ల మనసు శరీరం తేలికపడతాయి, ,, చేతివ్రాతను బట్టి ప్రవర్తనను ఆలోచనలను అంచనా వేయవచ్చు ,మనిషి అంతః సౌందర్యానికి మనోజ్ఞమైన భాష్యం హస్తాక్షరి, అలాంటి చేతిరాత శిక్షణను గత 25 సంవత్సరాల నుండి నిర్విరామంగా శిక్షణనిస్తున్నట్లు చేతిరాత నిపుణులు క్యాతం అశోక్ తెలిపారు.క్యాతం అశోక్ వివిధ పాఠశాలల్లో శిక్షణ నిచ్చి కొన్ని వేలమంది విద్యార్థులకు చేతిరాతలో మెలకువలను నేర్పారు, సులభమైన పద్ధతిలో ఇంగ్లీషులో లుసీడా కర్సివ్ వంటి వాటితో పాటు తెలుగు హిందీ భాషల చేతిరాత నేర్చుకునే విధానాన్ని సులభ పద్ధతిలో విద్యార్థులకు టీచర్లకు నేర్పించారు 2019వ సంవత్సరంలో రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల 8000 వేల మంది విద్యార్థులకు 2020 సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలలో 5000 మంది విద్యార్థులకు పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 4000 మంది విద్యార్థులకు, టీచర్లకు చేతిరాతపై శిక్షణను ఇచ్చారు ప్రతి సంవత్సరం వేసవి శిక్షణ శిభిరాలను నిర్వహిస్తుంటారు చేతిరాత సులభ పద్ధతిలోనేర్పడంక్యాతం అశోక్ ప్రత్యేకత


