జనం న్యూస్ 23 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన:- ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు గద్వాల పట్టణం “విద్యతో పాటు విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలు, భద్రతా అవగాహన పెంపొందించడం కూడా అత్యంత అవసరం అని ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్ లో ట్రాఫిక్ పోలీస్ వారి ఆధ్వర్యంలో ‘అరైవ్ అండ్ అలైవ్’ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు మాట్లాడుతూ…. విద్యార్థులకు రోడ్డు భద్రతకు సంబంధించిన నియమాలు, జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలైన అతి వేగం, నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ ఉపయోగం వంటి అంశాలను వారు వివరించారు.ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి,కార్ ప్రయాణికులు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలి, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను గౌరవించాలి అని స్పష్టం చేశారు. జీబ్రా క్రాసింగ్ వినియోగం, రోడ్డు దాటే సమయంలో ఇరు వైపులా చూసి దాటడం, పిల్లలు రోడ్డుపై ఆడకూడదనే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే 100 / 112 కు కాల్ చేయడం, బాధితుడికి ప్రాథమిక సహాయం అందించడం ఎంత ముఖ్యమో వివరించారు.“విద్యతో పాటు విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలు, భద్రతా అవగాహన పెంపొందించడం కూడా అత్యంత అవసరం మరియు చిన్న వయసులోనే రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తే, వారు జీవితాంతం ట్రాఫిక్ నియమాలను గౌరవించే బాధ్యతాయుత పౌరులుగా మారుతారు. ఈ తరహా అవగాహన కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా నిరంతరం కొనసాగిస్తాం” అని తెలిపారు.విద్యార్థులు చిన్న వయసు నుంచే ట్రాఫిక్ నియమాలు పాటిస్తే భవిష్యత్తులో ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని, “సురక్షితంగా వెళ్లి సురక్షితంగా తిరిగి రావడం ప్రతి ఒక్కరి బాధ్యత” అని అయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులచే వ్యాసరచన పోటీ నిర్వహించి,ఉత్తమ వ్యాసరచన రాసిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్సై 2 జంగిర్,తదితరులు పాల్గొన్నారు.



